ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  కరకగూడెం మండలంలో రెండు పూర్వ ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు

కరకగూడెం మండలంలో రెండు పూర్వ ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు.                     కరకగూడెం,ఆధాబ్ న్యూస్ ప్రతినిధి, మే 30: కరకగూడెం మండలంలోని అనంతారం, భట్టుపల్లి ప్రాథమిక పాఠశాలల పరిధిలో పూర్వ ప్రాథమిక పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల తెలిపారు.

చిన్నారుల ప్రారంభ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు ఈ పాఠశాలలు దోహదపడతాయని చెప్పారు.

ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం సంబంధిత ప్రాథమిక పాఠశాలల్లో ఒక తరగతి గదిని వినియోగించడంతో పాటు రంగురంగుల బొమ్మలు, ఆట వస్తువులు, విద్యా చార్టులు, ఫర్నిచర్ తదితర సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చనుందని తెలిపారు. అలాగే ఈ తరగతుల నిర్వహణకు ఉపాధ్యాయులు, ఆయాలను కూడా నియమించనున్నట్లు వెల్లడించారు.

నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల్లో తమ పిల్లలను చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 3-5 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….