అశ్వాపురం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్ జూన్ 20: సిరిశెట్టి కమలాకర్ – సుజాత దంపతుల కుమారుడు శ్యామ్ కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా అశ్వాపురంలోని ఆరిఫా అండ్ రోషిని వృద్ధాశ్రమంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనాలు అందజేసి వారి ఆశీర్వాదాలు పొందారు.
పుట్టినరోజు వేడుకలను ఆడంబరంగా కాకుండా సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని వృద్ధాశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని వృద్ధులతో కొంతసేపు గడిపారు. వృద్ధాశ్రమ వాసులు శ్యామ్ కౌశిక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 132








