వడదెబ్బకు మహిళ మృతి
పినపాక, మే 30 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాతరెడ్డి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల బయ్యారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొనగంటి భద్రమ్మ (53) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
వివరాల ప్రకారం, భద్రమ్మ తమ ఇంటి వద్ద ఉండగా తీవ్ర ఎండల కారణంగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించేలోపే ఆమె మృతి చెందినట్లు తెలిసింది.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనకు సంబంధించి అధికారిక నిర్ధారణ వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 24









