ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పెరటి కోళ్ల పెంపకానికి రూ.5.50 లక్షల నిధుల పంపిణీ

 

పెరటి కోళ్ల పెంపకానికి రూ.5.50 లక్షల నిధుల పంపిణీ

కరకగూడెం, మే 29 (ఆధాబ్ న్యూస్): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా కరకగూడెం మండలంలోని స్వయం శక్తి మండల మహిళా సమాఖ్య పరిధిలోని 27 గ్రామ సమాఖ్యలకు చెందిన 275 మంది సంఘ సభ్యులకు పెరటి కోళ్ల పెంపకం కోసం మొత్తం రూ.5.50 లక్షల నిధులను మంజూరు చేశారు.

ఈ సందర్భంగా నిధులకు సంబంధించిన చెక్కులను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎం బండి వినోద్ క్రాంతి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఎన్. గిరిబాబు, సీసీలు పోలేబోయిన విజయలక్ష్మి, సత్యనారాయణ, అకౌంటెంట్ ప్రీతి, సమాఖ్య ప్రతినిధి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్