ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజలు

కరకగూడెం మండలంలో గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజలు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ఇందిర మహిళా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కరకగూడెం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజలు ఘనంగా నిర్వహించారు.

చిరుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని పోలకమ్మ తోగు, రాయనపేట గ్రామాలతో పాటు రేగళ్ల గ్రామపంచాయతీలో భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలు చిరుమల్ల గ్రామపంచాయతీ సర్పంచ్ కొమరం సుగుణ, రేగళ్ల జీపీ సర్పంచ్ బాడిశ సుగుణ అధ్యక్షతన జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఎం‌పి‌డివో దేవవర కుమార్, తహసీల్దార్ వట్టం కాంతయ్య, ఏపీఎం బి. వినోద్ క్రాంతి, ఏఈ వెంకటేశ్వర్లు, మండల సమాఖ్య అధ్యక్షులు పోలేబోయిన సరస్వతి, జీపీ కార్యదర్శులు రామకృష్ణ, త్రినాద్, సీసీలు విజయలక్ష్మి, సత్యనారాయణ, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణంతో మహిళా సంఘాల కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్