తిలక్ వర్మను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్,మార్చి17 ఆధాబ్ న్యూస్:ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ తిలక్ వర్మను అభినందించారు. టీ20 క్రికెట్ వరల్డ్ కప్-2026కు సంబంధించిన భారత జట్టులో చోటు సంపాదించుకున్న తిలక్ వర్మ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాష్ట్రసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.
Post Views: 107









