ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నేతకాని సంస్కృతి–చరిత్ర డాక్యుమెంటేషన్ కమిటీ కో-కన్వీనర్‌గా గోగు సాయి ప్రకాష్

నేతకాని సంస్కృతి–చరిత్ర డాక్యుమెంటేషన్ కమిటీ కో-కన్వీనర్‌గా గోగు సాయి ప్రకాష్

కరకగూడెం,మార్చి 1 (ఆదివారం) ఆధాబ్ న్యూస్: నేతకాని (పద్మపులిందులు) జాతి ఘనమైన సంస్కృతి, చరిత్రను భావితరాలకు అందించేందుకు తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో “నేతకాని సంస్కృతి–చరిత్ర డాక్యుమెంటేషన్ కమిటీ” ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కో-కన్వీనర్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన గోగు సాయి ప్రకాష్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా గోగు సాయి ప్రకాష్ మాట్లాడుతూ నేతకాని (పద్మపులిందులు, కొండ జాతి వీరులు, అడవి బిడ్డలు) చరిత్రను వెలికితీసి డాక్యుమెంటరీ రూపంలో రూపొందించి తమ సమాజానికి, ప్రభుత్వానికి సమర్పించడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన జాడి ఈశ్వర్ నేతకానికి, సంఘం నాయకులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, కుల పెద్దల సహకారంతో డాక్యుమెంటేషన్ పూర్తి చేస్తానని పేర్కొన్నారు. అలాగే అన్ని వర్గాలను కలుపుకుని సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!