వలస గిరిజనుడు దారుణ హత్య.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని అశ్వారావుపాడు వలస ఆదివాసీ గ్రామంలో కోవాసి వెంకటేష్ అనే గిరిజనుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హతమార్చినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
స్థానికంగా ఈ ఘటన భయాందోళనలకు దారితీసింది. మృతుడి కుటుంబ సభ్యులు నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
Post Views: 20









