మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం
– తాటిగూడెం మైదానంలో పోటీలకు శ్రీకారం చుట్టిన ఎమ్మార్వో కాంతయ్య
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని తాటిగూడెం క్రీడా మైదానంలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మార్వో కాంతయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల ద్వారా యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు.
మండల స్థాయిలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగం వాలీబాల్లో సమత్ మోతె క్లస్టర్ మొదటి బహుమతిని గెలుచుకోగా, జూనియర్ విభాగం వాలీబాల్లో చిరుమల్ల క్లస్టర్ విజేతగా నిలిచింది. కబడ్డీ విభాగంలో చిరుమల్ల క్లస్టర్ విజయం సాధించగా, కోకో విభాగంలో కరకగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గెలుపొందారు.
విజేతలకు ఎమ్మార్వో కాంతయ్య బహుమతులు అందజేశారు. క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అసెంబ్లీ స్థాయి పోటీలకు పంపిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ గడ్డం మంజుల, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, సెక్రటరీలు, క్లస్టర్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.









