లంచం తీసుకుంటూ కొల్లూరు PSI.. ACB ట్రాప్‌లో పట్టుబాటు
సైబరాబాద్,ఆధాబ్ న్యూస్:
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం. రమేష్ లంచం డిమాండ్ చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల ట్రాప్‌లో చిక్కాడు.
సంగారెడ్డి జిల్లా పరిధిలో నమోదైన ఒక కేసులో ఫిర్యాదుదారుడి పేరు తొలగించేందుకు రూ.30,000 లంచం కోరినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రూ.5,000 తీసుకున్న ఎస్ఐ, మిగిలిన మొత్తం నుంచి రూ.20,000 స్వీకరిస్తున్న సమయంలో ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలకు ACB సూచన
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ACB అధికారులు కోరారు. అవినీతి నిర్మూలణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని మరోసారి గుర్తు చేశారు.









