ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో బిఆర్ఎస్ సర్పంచ్‌ల అభినందన సభ – రాబోయేది గులాబీ ప్రభుత్వమే : రేగా కాంతారావు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో నూతనంగా గెలుపొందిన బిఆర్ఎస్ సర్పంచ్‌లకు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై, మండల పరిధిలో గెలిచిన ప్రతి బిఆర్ఎస్ సర్పంచ్‌ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ, ప్రజల నమ్మకంతో బిఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జడ్పిటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో తప్పకుండా గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గెలిచిన సర్పంచ్‌లు విజయ గర్వంతో కాకుండా గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేయాలని సూచించారు. అలాగే ఓడిపోయిన నాయకులు నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, వారి సేవను ప్రజలు మరచిపోరని అన్నారు.

బెదిరింపులు, కక్షపూరిత రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు సాగవని, అలాంటి రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ నాయకులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాటం కొనసాగించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేగా కాళికా, నూతన సర్పంచ్‌లు, బిఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్