ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం,
ఆధాబ్ న్యూస్ :పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన రెండవ విడత పోలింగ్‌కు సంబంధించి ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.

చుంచుపల్లి మండలం రుద్రంపూర్, గౌతమ్‌పూర్, చుంచుపల్లి తండా, బాబు క్యాంప్, రామాంజనేయ కాలనీతో పాటు పాల్వంచ మండలం రంగాపురం, కేశవాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

రెండవ విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!