ఘనంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం కరకగూడెం పంచాయతీలోని సతిసామెత శ్రీ రాములవారి సన్నిధిలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురు స్వాములు గుమ్మడి వెళ్లి కృష్ణ రావుల కృష్ణ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులు రాజమల్ల హరీష్, గొడ్డటి గురుమూర్తి, కరకపెల్లి వెంకన్న, గంట స్వరుణ్ స్వాములకు ఇరుముడి మాలధారణ మహోన్నతంగా జరిగింది.
ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప మాలధారణ చేయడం ద్వారా సకల దోషాలు తొలగి, మనస్సు–బుద్ధి పవిత్రమై తేజస్సు పెరుగుతుందని అన్నారు. సనాతన ధర్మం ప్రకారం అయ్యప్ప స్వామి కృపతో భక్తులు కుటుంబసంతోషాలతో, పిల్లపాపలతో సుఖసంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.









