ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఖమ్మంలో పాల్వంచ యువకుడు డ్రెయినేజీలో పడి మృతి

ఖమ్మంలో పాల్వంచ యువకుడు డ్రెయినేజీలో పడి మృతి

ఖమ్మం ,ఆధాబ్ న్యూస్: ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద జరిగిన దుర్ఘటనలో పాల్వంచకు చెందిన కొత్తపల్లి నరేందర్ (30) అనే యువకుడు మృతి చెందాడు.

మంగళవారం ఉదయం స్థానికులు మార్కెట్ ప్రాంతంలోని డ్రెయినేజీలో ఒక మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు.

అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహాయంతో మృతదేహాన్ని డ్రెయినేజీ నుంచి బయటకు తీసి, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!