మెదక్‌లో ఏసీబీ దాడి… లంచం తీసుకుంటూ ఎస్సై రాజేష్ అరెస్ట్
మెదక్,ఆధాబ్ న్యూస్:
మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి ముదిరింది. రూ.50 వేల లంచం స్వీకరిస్తున్న ఎస్సై రాజేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన దాడిని గమనించిన రాజేష్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.
ఏసీబీ బృందం వెంటపడడంతో టేక్మాల్ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్సై రాజేష్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి అధికారులు విచారణ చేపట్టారు.
స్థానికుల మధ్య ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. ఎస్సై రాజేష్ ఏసీబీకి చిక్కడంతో గ్రామస్తులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
Post Views: 44









