చేవెళ్ల ప్రమాదం.. డ్రైవర్ తప్పు కాదు – ఆర్టీసీ వివరణ
హైదరాబాద్ ,ఆధాబ్ న్యూస్: చేవెళ్ల వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సంస్థ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు నివేదికను సమీక్షించిన ఆర్టీసీ అధికారులు, టిప్పర్ లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు.
రోడ్డు మలుపులో టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సును ఢీకొట్టాడని, ప్రమాదానికి ఆర్టీసీ బస్సుగానీ, డ్రైవర్ గానీ కారణం కాదని తెలిపారు.
అదేవిధంగా, బస్సు డ్రైవర్ సర్వీసు రికార్డులో గతంలో ఎటువంటి ప్రమాదాలు లేవని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా డ్రైవర్లకు అదనపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Post Views: 48









