ప్రతి క్షణం
ప్రజల పక్షం

  చెక్కు బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష – రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం

చెక్కు బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష – రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
మణుగూరు, ఆధాబ్ న్యూస్;
మణుగూరు చెక్కు బౌన్స్ కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు.

వివరాల్లోకి వెళ్తే—మణుగూరు మండలం అశోక్‌నగర్‌కు చెందిన గారపాటి సత్యనారాయణ, అదే ప్రాంతానికి చెందిన మంచాల అంజయ్య వద్ద రూ.8 లక్షలు రుణంగా తీసుకున్నారు. రుణం చెల్లించేందుకు 2019లో ఇచ్చిన చెక్కు బ్యాంకులో సరిపడా నిధులు లేక బౌన్స్ అయింది.

తర్వాత అంజయ్య నోటీసు పంపినా సత్యనారాయణ స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైనందున సత్యనారాయణకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

ఈ కేసులో ఫిర్యాదుదారుని తరపున న్యాయవాదులు నగేష్‌కుమార్, మధుసూదన్, రమేష్‌లు వాదించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్