కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం
(బిఆర్ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బయ్యారం–తాడ్వాయి ప్రధాన రహదారి ముత్తారం ప్రాంతంలో రోడ్డు స్థితిని శుక్రవారం పరిశీలించిన స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంతలతో నిండిపోయి ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారిపై “గుంతల సెల్ఫీ” డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బిఆర్ఎస్ కరకగూడెం మండల యూత్ అధ్యక్షుడు గుడ్ల రంజిత్
ఈ రహదారిపై ప్రతిరోజూ ద్విచక్ర వాహనదారులు పడిపడి గాయపడుతున్నారు. ప్రాణాపాయాలు, శాశ్వత అంగవైకల్యాలు సంభవిస్తున్నా ప్రభుత్వం, ఆర్ అండ్ బి శాఖ ఏ చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి” అని డిమాండ్ చేశారు.
సిపిఐ మండల కార్యదర్శి వంగరి సతీష్ మాట్లాడుతూ “ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పట్టించుకోవడం లేదు. ఈ రహదారి నిజంగా యమపాశాలా మారింది. ప్రజల శ్రేయస్సు దృష్టితో తక్షణమే మరమ్మత్తులు చేయాలి” అని మండిపడ్డారు.
ప్రజలు కూడా ఈ రహదారి వల్ల నిత్యం భయంతో ప్రయాణం చేయాల్సి వస్తోందని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.









