జిల్లా సహకార అధికారి లంచం తీసుకుంటూ పట్టుబాటు
మంచిర్యాల, ఆధాబ్ న్యూస్: అక్టోబర్ 25:
బెజ్జూర్ పిఎసిఎస్ రెన్యువల్ కోసం లంచం తీసుకుంటూ జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు నాయక్ ఏసీబీ అధికారుల చేతికి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్ నుండి రెన్యువల్‌కు సాయం చేస్తానని పేరుతో మొత్తం రూ.8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు విడతలుగా చెల్లించేందుకు ఒప్పందం కాగా, మొదటి విడతగా రూ.2 లక్షలు అందుకునే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు.
ఈ ఘటనను ఏసీబీ అధికారులు నస్పూర్ కలెక్టరేట్ ఆఫీస్ వద్ద నమోదు చేసి విచారణ చేపట్టారు. లంచం వ్యవహారం వెలుగులోకి రావడంతో సహకార శాఖలో ఒక ప్రకంపన రేగినట్లు తెలుస్తోంది.
Post Views: 80









