ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సూర్యాపేటలో బీహార్ కార్మికుల ఆందోళన – పోలీసులపై దాడి

సూర్యాపేటలో బీహార్ కార్మికుల ఆందోళన – పోలీసులపై దాడి
సూర్యాపేట, ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న బీహార్ కార్మికులు పోలీసులపై దాడికి దిగడంతో పరిస్థితి వేడెక్కింది.

వివరాల్లోకి వెళ్తే – నిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు గాయపడి, మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో సహచర కార్మికులు కంపెనీ ఎదుట న్యాయం చేయాలని ఆందోళన ప్రారంభించారు.

కార్మికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఘర్షణ తలెత్తింది. ఆగ్రహంతో ఉన్న బీహార్ కార్మికులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడగా, రెండు పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతుండగా, అదనపు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!