ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్

మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్
ఏపీ,/టీజీ: ఆధాబ్ న్యూస్:
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ ప్రభావం కారణంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

🔶 తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి.

➡️ అధికారులు ప్రజలను బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వర్షాలు ఎక్కువగా కురిసే సమయాల్లో అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్