రైతులకు ప్రభుత్వం తీపి కబురు: యూరియా సరఫరా ప్రారంభం
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో యూరియా లభ్యం కాక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. నిన్న రాష్ట్రానికి 9 వేల టన్నుల యూరియా చేరగా, ఇవాళ రాత్రిలోపు మరో 5 వేల టన్నులు రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరో వారం రోజుల్లో మొత్తం 27,470 టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనున్నట్లు సమాచారం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
అలాగే, వరదల వల్ల పంటలకు జరిగిన నష్టంపై వచ్చే 5 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని సంబంధిత విభాగాల అధికారులను మంత్రి ఆదేశించారు.
Post Views: 59









