రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలో ముందుకు నడిపిన దూరదృష్టి నాయకుడు అని పేర్కొన్నారు. ఐటీ రంగానికి పునాదులు వేసి, 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించిన సంస్కరణ కర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. దేశ ఐక్యత కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానీయుడని, రాజీవ్ గాంధీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు తొలేం నాగేశ్వరరావు, మోకాళ్ళ పాపారావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నేతాజీ, జట్ల సత్యం, నాయకులు ఎర్ర సురేష్, పూజారి వెంకన్న, పోలేబోయిన సీతారాంబాబు, పూణేం బుచ్చయ్య, గొగ్గలి రవి, వగలబోయిన శ్రీను, గాంధర్ల రామనాథం, కరకపల్లి నాగేష్, దుర్గం కన్నయ్య, సురా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.









