ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి : సీఐ ఎల్లయ్య

లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి : సీఐ ఎల్లయ్య

అశ్వాపురం,ఆధాబ్ న్యూస్ : వాహనాలు నడిపే ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని అశ్వాపురం సీఐ ఎల్లయ్య సూచించారు. స్థానిక ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన బాధ్యతగా భావించి ఆటో డ్రైవర్లు విధులు నిర్వహించాలని కోరారు.

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సీఐ ఎల్లయ్య తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్