కలవల్నాగారం అటవీ ప్రాంతంలో 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలవల్నాగారం సమీప అటవీ ప్రాంతంలో ఎస్ఐ పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో పోలీసులు అక్రమ సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ పి.వి.ఎన్. రావు మాట్లాడుతూ, మండల పరిధిలో ఎక్కడైనా అక్రమంగా సారా తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే కరకగూడెం పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అక్రమ సారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post Views: 42








