ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌

పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు

బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌

కరకగూడెం, అక్టోబర్‌ 18 (ఆధాబ్‌ న్యూస్‌): పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కరకగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుడగం రామును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య తెలిపారు. ఇకపై బుడగం రాముకు బీఆర్‌ఎస్‌ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కరకగూడెం మండల బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం రావుల సోమయ్య అధ్యక్షతన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమంపై నాయకులు చర్చించారు. ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ ఇన్‌చార్జిలు తమ పరిధిలోని గ్రాడ్యుయేట్‌ ఓటర్లను సంప్రదించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అదే సమావేశంలో బుడగం రామును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ తీర్మానం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతూ, పార్టీపై విమర్శలు చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మానాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు పంపినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ లైన్‌ దాటి వ్యవహరించే వారిని ఎంతటి స్థాయి వ్యక్తులైనా ఉపేక్షించేది లేదని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కొమరం రాంబాబు, రావుల కనకయ్య, సర్పంచ్‌ కొమరం సత్యనారాయణ, మాజీ సర్పంచులు పాయం నరసింహారావు, ఊకే రామనాథం, గొగ్గలి నారాయణ, గొగ్గలి నర్సయ్య, కరకగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కటకం లేనిన్‌, ఈసం సమ్మయ్య, సీనియర్‌ నాయకులు ఎళ్ళు రామకృష్ణారెడ్డి, వట్టం వెంకటేశ్వర్లు, ఎగ్గడి శ్రీనివాస్‌, వైద బిక్షపతి, చిట్టీమల్ల ప్రవీణ్‌, సయ్యద్‌ పాషా, దాసరి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

– ఆధాబ్‌ న్యూస్‌

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు