ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి

భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

కరకగూడెం, అక్టోబర్ 15 (ఆధాబ్ న్యూస్): భూ రీ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి భూముల హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం కరకగూడెం మండలంలోని బట్టుపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

బట్టుపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు 1,160 ఎకరాల్లో జరుగుతున్న రీ సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీజీపీఎస్, జీఎన్ఎస్ఎస్ రోవర్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో భూముల సరిహద్దులను గుర్తిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సర్వే నంబర్ల వారీగా భూముల హద్దులను పరిశీలిస్తూ అటవీ భూములు, రైతుల పట్టా భూముల మధ్య ఉన్న సరిహద్దు రాళ్లను గుర్తించి వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడి వారి పట్టా పుస్తకాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న కొలతలను రెవెన్యూ రికార్డులు, పట్టా వివరాలతో సరిపోల్చి భూముల హక్కులు, హద్దులను నిర్ధారించాలని సూచించారు. కొండ ప్రాంతాలు, దట్టమైన చెట్ల కారణంగా కొన్ని ప్రాంతాల్లో శాటిలైట్ సిగ్నల్ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.

రైతుల భూముల హక్కులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అటవీ, పట్టా భూముల మధ్య సరిహద్దుల నిర్ధారణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కాంతయ్య, సర్వేయర్ సందీప్, బట్టుపల్లి సర్పంచ్ తోలేం రమాదేవి, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు