ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  కూనంనేని సాంబశివరావు అరెస్టును ఖండించిన సీపీఐ

కూనంనేని సాంబశివరావు అరెస్టును ఖండించిన సీపీఐ

పినపాక, జూన్ 27 (ఆధాబ్ న్యూస్): హనుమకొండ జిల్లా కేంద్రంలోని అదాలత్ సెంటర్‌లో పేదల పక్షాన పోరాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ పినపాక మండల కార్యదర్శి తోగటి కుమార్ తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను అధికారులు బలవంతంగా తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిలువ నీడలేని పేదలు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా, వారికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

అక్రమ అరెస్టులతో పేదల భూపోరాటాలను, ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించిన ఆయన, ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని, అరెస్టు చేసిన వామపక్ష నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….