మొదటి ప్రమాద హెచ్చరిక జారీ – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం ఈరోజు ఉదయం 08:15 గంటలకు 43.00 అడుగులు చేరింది. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. దీంతో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక (1st Warning) జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు.
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వరద పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని, అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని ఆయన కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించవచ్చు.









