కరెంట్ షాక్‌తో తండ్రి-కొడుకులు మృతి
సిద్ధిపేట,ఆధాబ్ న్యూస్:
సిద్దిపేట జిల్లా సందులాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పొలంలో వైర్లు కడుతుండగా విషాదం సంభవించింది. ఈ క్రమంలో రక్షణ వైరు అనుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో రైతు గజేందర్ రెడ్డి, కుమారుడు రాజేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షాకాలంలో రైతులు పొలాల వద్ద పని చేసే సమయంలో విద్యుత్ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు
Post Views: 77









