రేపు మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో కూడా సోమవారం నుండి వర్షాలు ప్రారంభమవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ప్రత్యేకంగా 18, 19 తేదీల్లో అత్యంత అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Post Views: 59









