రాష్ట్రంలో టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: పర్యాటకుల భద్రత కోసం రాష్ట్రంలో టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు DGP జితేందర్ ప్రకటించారు. తొలి దశలో 80 మంది పోలీసుల సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అనంతగిరి, రామప్ప, సోమశిల, నాగార్జునసాగర్, బుద్ధవనం వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో స్వదేశీ, విదేశీ టూరిస్టులకు రక్షణ కల్పించడం ఈ విభాగం లక్ష్యం.
వచ్చే నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Post Views: 31









