ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  గిరిజన చిన్నారుల చదువుకు వనవాసి కళ్యాణ పరిషత్ చేయూత

గిరిజన చిన్నారుల చదువుకు వనవాసి కళ్యాణ పరిషత్ చేయూత

భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా భద్రాచలంలోని శిశు మందిర్‌లో చదువుతున్న గిరిజన చిన్నారులు సోయం భవ్య శ్రీ, భాను శ్రీలకు చదువుకోసం ఆర్థిక సహాయం అందించారు.

చర్ల మండలం, చెలిమెల గ్రామానికి చెందిన ఈ చిన్నారులు తండ్రిని కోల్పోయి, తల్లి మరియు సోదరులతో కష్టాల్లో జీవిస్తున్నారు. ఈ విషయం వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ సూచనపై, హైదరాబాద్‌కు చెందిన పెద్దాడ హితనంద్ ద్వారా తుమ్మలపల్లి స్ఫూర్తి ముందుకు వచ్చి, ఒక సంవత్సరం చదువుకోసం రూ. 17,000 సహాయం అందించారు.

ప్రధాన ఆచార్య గీత మాత ఆ చిన్నారుల తరపున ఆర్థిక సహాయం స్వీకరించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి స్ఫూర్తి చిన్న వయసులోనే ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు రావడం గొప్ప విషయం అని అభినందించారు.

ఈ కార్యక్రమంలో వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత సహా మహిళా ప్రముఖు పెద్దాడ ఆశాలత, సరస్వతీ శిశు మందిర్ ప్రధాన ఉపాధ్యాయురాలు గీత, సూర్యనారాయణ, సింధు మాతాజీ, దుర్గ భవాని, సత్యనారాయణ, కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….