ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గుండాల తాసిల్దార్‌కు వినతిపత్రం ఇచ్చిన ఆదివాసి సంక్షేమ పరిషత్‌ నేతలు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మండల అధ్యక్షుడు పూనేం రమణబాబు

గుండాల తాసిల్దార్‌కు వినతిపత్రం ఇచ్చిన ఆదివాసి సంక్షేమ పరిషత్‌ నేతలు
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మండల అధ్యక్షుడు పూనేం రమణబాబు

గుండాల, ఆధాబ్ న్యూస్:
గుండాల మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంక్షేమ పరిషత్‌ గుండాల మండల అధ్యక్షుడు పూనేం రమణబాబు గుండాల తాసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ బదలాయింపు నిషేధ చట్టం 1970 ప్రకారం 03-02-1970 తరువాత ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన గిరిజనేతరులకు భూమిని బదలాయింపు చేయరాదు. ఇల్లు నిర్మించుకోవడానికి, వ్యాపార సముదాయాలు నిర్వహించేందుకు కూడా అవకాశం లేదని 1/70 చట్టం స్పష్టంగా పేర్కొంటుందని తెలిపారు.

కానీ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గుండాల మండల కేంద్రంలో గిరిజనేతరులు విచ్చలవిడిగా గిరిజన మరియు ప్రభుత్వ భూములను ఆక్రమించి బహుళ అంతస్తుల కట్టడాలు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ఆదివాసీల జీవనవిధానానికి, సంస్కృతికి పెను ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.

తక్షణమే ఈ వ్యవహారాన్ని ఎల్.టి.ఆర్. సుమోటో కేసుగా పరిగణించి అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్‌ను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనేం వసంత్, మండల ప్రధాన కార్యదర్శి గోగ్గేలా సుధాకర్, నాయకులు జబ్బ సుదర్శన్, పూనేం రాజేందర్, చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్