కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా గడ్డం ప్రవీణ్ బాధ్యతల స్వీకారం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ : కొత్తగూడెం పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కి కొత్తగా ఎస్‌హెచ్‌ఓగా గడ్డం ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా సమర్థవంతంగా పని చేయాలని ఆయన అన్నారు.
గతంలో పలు కీలక వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించిన గడ్డం ప్రవీణ్, కోర్ట్ ఫంక్షనల్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. న్యాయపరంగా శీఘ్రంగా కేసులను పరిష్కరించి శిక్షలు విధింపజేసే విషయంలో ఆయన పాత్ర ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు.
కొత్తగూడెంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గడ్డం ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా, పట్టణ ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో డ్రైవులు, అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
పట్టణ వాసులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల భద్రతకు, రవాణా సౌలభ్యానికి ట్రాఫిక్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.









