భద్రాద్రి జిల్లాలో విషాదం రైతు సజీవదహనం
గుండాల ఆధాబ్ న్యూస్:
గుండాల మండలంలో విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయిన రైతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలం వద్దకు బైకుపై వెళ్తున్న ఓ రైతు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే — గుండాల మండలంలోని వన్నెలబైలు గ్రామానికి చెందిన రాజు (వయసు 35) ఈరోజు ఉదయం తన పొలానికి బైకుపై వెళ్తున్న సమయంలో, దారిలో ఊరిస్తున్న విద్యుత్ తీగలు అతడికి తగిలాయి. ఒక్కసారిగా విద్యుదాఘాతం సంభవించి మంటలు చెలరేగాయి. బైకుతో పాటు రాజు కూడా పూర్తిగా దగ్ధమై అక్కడికక్కడే మృతి చెందాడు.
Post Views: 375









