ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మంత్రి తుమ్మల ఫోన్ చోరీ.. గంటలోనే ట్రేస్ చేసిన పోలీసులు!

మంత్రి తుమ్మల ఫోన్ చోరీ.. గంటలోనే ట్రేస్ చేసిన పోలీసులు!
కరీంనగర్,ఆధాబ్ న్యూస్:
కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో చిన్నపాటి హడావుడి చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యింది. అయితే, ఈ సంఘటనలో పోలీసుల చురుకైన చర్యతో గంట వ్యవధిలోనే ఫోన్‌ను ట్రేస్ చేసి, తిరిగి మంత్రికి అప్పగించారు.

పోలీసులు మొబైల్ ఫోన్ యొక్క లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి, ఆ ఫోన్ ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆయనను సంప్రదించి, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని మంత్రికి తిరిగి అప్పగించారు.

ఈ ఘటన మంత్రి తుమ్మల పర్యటనకు సెక్యూరిటీ పరంగా ప్రశ్నార్థకంగా మారినా, పోలీసుల వేగవంతమైన చర్య అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. అలాగే, ఈ సంఘటన రాజకీయంగా చిన్న సంచలనంగా మారింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్