విద్యుదాఘాతంతో యువకుడు దుర్మరణం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భట్టుపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బిలపాటి నరేందర్ (18) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు.
సోమవారం నరేందర్ పొలానికి వెళ్లి మోటార్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో, ఫెన్సింగ్ తీగలను పరిశీలించే క్రమంలో కరెంట్ ఉన్న తీగలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.
ఈ ఘటనపై కరకగూడెం ఎస్‌ఐ స్పందిస్తూ, విద్యుదాఘాతానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.
Post Views: 50









