ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రైతులు కరెంట్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి: ఏడీఈ ఉమారావు

రైతులు కరెంట్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి: ఏడీఈ ఉమారావు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కరకగూడెం ఏఈ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా మణుగూరు ఏడీఈ ఉమారావు మాట్లాడుతూ, “రైతులు పంటలకు ఉపయోగించే కరెంట్‌ను జాగ్రత్తగా వినియోగించాలి. మోటార్ల వద్ద ప్లాస్టిక్ బాక్సులు తప్పనిసరిగా వాడాలి. తడి చేతులతో గానీ, తడి కాళ్లతో గానీ చిచ్చులు వేయడం ప్రమాదకరం. వర్షాకాలంలో మోటార్ వద్దకు వెళ్లరాదు. గాలి వల్ల తీగలు తెగినపుడు లేదా విద్యుత్ స్తంభాలు విరిగినపుడు వెంటనే లైన్‌మన్‌కు సమాచారం ఇవ్వాలి,” అని హెచ్చరించారు.

అంతేకాక, “రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. కరెంట్ సరఫరా లోటుపాటుల్లేకుండా వ్యవస్థను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో రాజశేఖర్, రవీందర్, రత్నశేఖర్, వేంకటేశ్వర్లు, సాగర్, నరసింహారావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!