*మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.*
*షీ టీమ్స్ మరియు AHTU కార్యాలయాల్ని సందర్శించిన ఎస్పీ.*
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
మహిళలలపై జరుగుతున్న నేరాలను అడ్డుకొని వారికి న్యాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన TGWSW ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన విభాగమే షీ టీమ్స్ అని ఎస్పీ తెలిపారు.
మహిళలపై లైంగిక వేధింపులు,ర్యాగింగ్,ఈవ్ టీజింగ్,బ్లాక్మెయిలింగ్ ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లా షీ టీమ్స్ ఫోన్ నంబరు 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చని అన్నారు.
Post Views: 38









