ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి డా. జయలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మందుల నిల్వలు, వైద్యుల రికార్డులు, రక్తపరీక్షా కేంద్రం వంటి విభాగాలను ఆమె బహుళంగా పరిశీలించారు.

ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్యసేవల నాణ్యతపై డా. జయలక్ష్మి సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం మాట్లాడుతూ –
“ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించాలనే దిశగా మనం పనిచేయాలి. అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ దృష్టిని న్యాయంగా సమర్థించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది,” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎంఓ ఫైజ్ మొహిద్దిన్, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్