ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ కు మణుగూరులో ఘన స్వాగతం
మణుగూరు,ఆధాబ్ న్యూస్: మణుగూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ కు స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారిగా శ్రీనివాసరావు, తహసిల్దార్ నరేష్, ఎంఈఓ స్వర్ణజ్యోతి, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు కలెక్టర్ కు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం తెలిపారు.
అధికారులతో కలెక్టర్ కార్యాలయ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
Post Views: 59









