ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాచలం న్యాయమూర్తికి రాష్ట్ర స్థాయి గౌరవం

భద్రాచలం న్యాయమూర్తికి రాష్ట్ర స్థాయి గౌరవం

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర న్యాయమూర్తుల అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా భద్రాచలం జ్యూడిషియల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ నాయక్ ఎన్నికయ్యారు.

హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన 2025-26 సంవత్సరానికి గాను అసోసియేషన్ ఎన్నికల్లో శివ నాయక్ విజయం సాధించారు.

ఈ విషయాన్ని ఎన్నికల అధికారి మరియు సిటీ సివిల్ కోర్టు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎస్. శశిధర్ రెడ్డి ప్రకటించారు.

ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికైన శివ నాయక్‌కు న్యాయ వృత్తిలో ఉన్న పలువురు అధికారులు, సహచర న్యాయమూర్తులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ – “ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది. న్యాయవ్యవస్థలో పారదర్శకత, న్యాయమూర్తుల సంక్షేమం కోసం కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్