అదుపుతప్పి వరి పొలంలోకి దూసుకెళ్లిన ఆటో – డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
పినపాక,ఆధాబ్ న్యూస్: పినపాక మండలం గోపాలరావుపేట – కలవలనాగారం గ్రామాల మధ్య రోడ్డుపై ఆటో అదుపుతప్పి వరి పొలంలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆటోలో ఒక్కరే ఉండగా, అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఆటో పల్టీ కొట్టిన ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆటోను పైకి లేపి డ్రైవర్‌ను బయటకు తీశారు.
డ్రైవర్ షారుక్ పాషా కలవలనాగారం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఆయనను ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
Post Views: 48









