బూర్గంపాడు మండల ప్రజలకు పోలీసుల హెచ్చరిక: భారీ వర్షాలు… అప్రమత్తంగా ఉండండి – ఎస్ఐ మేడా ప్రసాద్
బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్ హెచ్చరించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చిన్న పిల్లలను కాలువలు, డ్రైనేజీల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వాగులు వంకలు పొంగిపొర్లే పరిస్థితుల్లో ప్రజలు వాటిని దాటే ప్రయత్నాలు చేయరాదని, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. రైతులు పొలాలకు వెళ్తున్న సమయంలో వాగులు ఉప్పొంగే అవకాశం ఉండటంతో అటువంటి మార్గాల్లో ప్రయాణం నివారించాలని హెచ్చరించారు.
వీధుల్లో ఐరన్ విద్యుత్ తీగలు తడిగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు వాటిని తాకరాదని, పాత ఇళ్ళు ఉంటే ముందు జాగ్రత్తగా ఖాళీ చేయాలని సూచించారు. రోడ్లపై వరద నీరు ఉంటే ఆ మార్గంలో ప్రయాణం నివారించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100 నంబర్‌కు లేదా బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
📞 ఎస్ఐ మేడా ప్రసాద్: 8712682055
📞 స్టేషన్ నంబర్: 8712682056









