ట్రాక్టర్ దమ్ము చక్రాలతో రోడ్లపై నడిపితే ట్రాక్టర్లు సీజ్ – ఎస్‌ఐ పీవీఎన్ రావు హెచ్చరిక
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
వరి నాట్ల సీజన్ నేపథ్యంలో ట్రాక్టర్ యజమానులు తారు రోడ్లు మరియు సీసీ రోడ్లపై ట్రాక్టర్‌కు ప్రత్యేకంగా అమర్చే దమ్ము చక్రాలతో వాహనాలు నడిపితే, ట్రాక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని కరకగూడెం ఎస్‌ఐ పీవీఎన్ రావు హెచ్చరించారు.
దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపై నడిపితే ప్రభుత్వ రహదారులపై తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. ప్రజాధనం అయిన రోడ్లను హానిచేసేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.
ట్రాక్టర్ యజమానులు తారు మరియు సీసీ రోడ్లపై దమ్ము చక్రాలు అమర్చిన ట్రాక్టర్లను నడపరాదని, ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే, వారి ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ప్రతి ట్రాక్టర్ యజమాని చట్టబద్ధంగా వ్యవహరించి, పోలీసులకు సహకరించాలని సూచించారు.









