ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక – భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ. రోహిత్ రాజ్ ఐపీఎస్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక – భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ. రోహిత్ రాజ్ ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.

వర్షాల తీవ్రత కారణంగా నదులు, వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. వీటి పరిసర ప్రాంతాల్లోకి వెళ్లడం ప్రమాదకరమని తెలిపారు. సెల్ఫీల కోసం లేదా యాదృచ్ఛికంగా ప్రవహిస్తున్న నీటి ప్రాంతాల్లోకి వెళ్లడం వల్ల ప్రాణాపాయం ఏర్పడే అవకాశముందని స్పష్టం చేశారు.

చేపల వేట కోసం లేదా పశువులను కాయడానికి నదుల, వాగుల పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సహాయం పొందవచ్చని సూచించారు.

వర్షాల కారణంగా కొన్ని రహదారులు ప్రమాదకరంగా మారినట్టు గుర్తించి, వాటి వద్ద పోలీసులు ఇతర శాఖలతో కలిసి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, అనవసర ప్రయాణాలు నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లాలోని ప్రతి ఒక్కరు పోలీసు శాఖకు సహకరించాలని కోరుతూ, ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యమని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!