ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండల ప్రజలకు పోలీసులు హెచ్చరిక – అప్రమత్తంగా ఉండాలి ఎస్సై పి.వి.ఎన్ .రావు

కరకగూడెం మండల ప్రజలకు పోలీసులు హెచ్చరిక – అప్రమత్తంగా ఉండాలి ఎస్సై పి.వి.ఎన్ .రావు

కరకగూడెం, జూలై 23: ఆధాబ్ న్యూస్:
రానున్న రెండు మూడు రోజుల్లో కరకగూడెం మండలంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ పీ.వి.ఎన్. రావు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని తెలిపారు.

వీధుల్లో, రహదారుల వద్ద కరెంట్ స్తంభాలు, తీగలు, ఐరన్ వైర్లు తడిగా ఉండే అవకాశం ఉండటంతో వాటిని ముట్టకూడదని సూచించారు. అలాగే, తీవ్ర వర్షాల కారణంగా పాత ఇళ్లు కూలే ప్రమాదం ఉన్నందున అటువంటి ఇళ్లను ముందుగానే ఖాళీ చేయాలని సూచించారు.

వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలి. నాళాలు, వాగులు ఉప్పొంగినపుడు వాటిని దాటి ప్రయాణించకూడదు. రోడ్లపై వరదనీరు ప్రవహిస్తే ఆ మార్గాల్లో రాకపోకలు నివారించాలని సూచించారు.

అటువంటి ప్రమాదకర పరిస్థితులలో కరకగూడెం పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

📞 87126 82102 – SI P. V. N. Rao
📞 87126 82103 – PS Karakagudem

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!