శ్రీ వెంకటేశ్వర కల్యాణ మహోత్సవానికి పొదెం వీరయ్య హాజరు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలం పట్టణంలోని వెంకటేశ్వరరావు కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన శ్రీ వెంకటేశ్వర కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పొదెం వీరయ్య గౌరవ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు.
అనంతరం దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. కల్యాణోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన దేవస్థాన సభ్యులను పలువురు అభినందించారు.
Post Views: 27









