మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
కరకగూడం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి రేగా నర్సమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం కరకగూడెంలోని వారి నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగా కాంతారావు ను పరామర్శించి కుటుంబానికి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గ ప్రసాద్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, తాళ్లూరి చక్రవర్తి, కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఆళ్ల సర్వేశ్వరరావు రేగా నర్సమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన నాయకుడు మిట్టపల్లి నితిన్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగబండి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు బరపాటి వెంకన్న, షేక్ రఫీ, వగలబోయిన శ్రీను, రాజేంద్ర ప్రసాద్, గాంధర్ల రామనాథం తదితరులు పాల్గొన్నారు.









